వారు హాజరు కావాల్సిందే : ఎసిబి

హైదరాబాద్‌, జూన్‌ 9 : ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎసిబి శనివారంనాడు నోటీసులు జారీ చేసింది. మద్యం సిండికేట్ల కేసులో వారు తప్పనిసరిగా హాజరవ్వాలని కోరింది. ఈ నెల 19, 20 తేదీల్లో హాజరు కావాలని వారిని ఆదేశించింది. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కవిత, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య, కృష్ణబాబు నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు మనోహర్‌నాయుడులకు కూడా ఎసిబి నోటీసులు జారీ చేసింది.