వాళ్లది అధికారం కోసం ఆరాటం – మాది ఆత్మగౌరవ పోరాటం

భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) :
టీిఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర సాధన ద్యేయంగా ఆత్మగౌరవం కోసం పోరాడుతుంటే, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీిలది అధికారం కోసం ఆరాటపడుతున్నట్లు టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు సిరికొండ మధు సూధనాచారి స్పష్టం చేశారు. శుక్రవారం ఏరియా లోని కేటికే 1వ గని ఆవరణలో జరిగిన గేట్‌ మీటింగ్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన సిరికొండ కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ సింగరేణి ఎన్ని కలు తెలంగాణ వాదానికి, సమైఖ్యాంద్రులకు వ్యతి టరేకంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఏఐటీ యూసీి, ఏఎన్‌టియుసిలు గుర్తింపు సంఘాలుగా గెలిచి సింగరేణిలోని వనరులను సీమాంద్ర ప్రాం తానికి తరలించే కుట్ర పన్నినట్లు తెలిపారు. మరో సారి వారికి అధికారం వస్తే మొత్తం సింగరేణిని అమ్ముకుంటారని పేర్కోన్నారు. కార్మికులు ఈ సారి మోసపోవద్దని కోరారు. అనంతరం టిబిజి కఎస్‌ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ప్రసంగిస్తూ జాతీయ సంఘాలన్ని జాదు సంఘాలని ఎద్దేవ చేశారు. 9వ వేజ్‌బోర్డులో ఏదో సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారని కాని వారు పెంచిం ది గొర్రె తోక బెత్తెడు అన్న చందంగా అన్నట్లు ఉందన్నారు. టిబిజికెఎస్‌ను గెలిపిస్తే అధి కారులతో సమానంగా వేతనాలు, అలవెన్సులు ఇప్పిస్తామని స్పష్టం చేశారు. ఒక పరిశ్రమలో పని చేస్తున్న ఉద్యోగులకు ఒకేలా వేతనం అందిం చడంలో జాతీయ సంఘాలు పూర్తిగా విఫలమై నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఏఐటియుసి, ఏఎన్‌టియుసిలకు చెందిన 150మంది కార్మికులు మెత్కుపల్లి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో టిబిజికెఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వారిని సిరికొండ, కెంగర్ల మల్లయ్యలు సాదరంగా యానియన్‌లోకి ఆహ్వా నిస్తూ గులాబి కండువాలు కప్పారు. ఈ కార్య క్రమంలో శ్రీనివాస్‌, సంపత్‌, మనోజ్‌కుమార్‌, సంపత్‌రావు, లక్ష్మణ్‌, మహేందర్‌, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.