విజయవాడ డివిజన్‌లో భారీ వర్షాలు

విజయవాడ: విజయవాడ రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని 15 మండలాల్లో ఆదివారం రాత్రినుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలో అత్యధికంగా 107.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఆ తరువాత స్థానంలో నందిగామలో 93.6మి.మీ, మూడవస్థానంలో పునమలూరు మండలంలో 93మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.