విడుదల కానున్న విశ్వరూపం

చెన్నై : కమల్‌హాసన్‌ నిర్మించిన విశ్వరూపం చిత్రం విడుదలకు తమిళనాడులో అడ్డంకి తొలగిపోయింది.ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమల్‌హాసన్‌ బృందం, ముస్లిం సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో తమిళనాడులో చిత్రం విడుదల కానుంది. సినిమాలోని 7 సన్నివేశాలు. 8 సంభాషణలు తొలగించేందుకు చిత్ర నిర్మాణ బృందం అంగీకరించింది. దీంతో ఈ చిత్రం పై వేసిన దావాను వెనక్కు తీసుకోనున్నట్లు ముస్లిం సంఘాలు ప్రకటించాయి.

తాజావార్తలు