విదేశీ పర్యటనలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు

హైదరాబాద్‌: మంత్రులు, ఉన్నతాధికారుల అధికారిక విదేశీ పర్యటనలపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్‌ 15 వ తేదీతో ముగిసిన పర్యటనల నిషేధం గడువును 2013 జూన్‌ 15 వరకూ పొడిగించారు. కొన్ని ప్రత్యేక సందర్భాలు, కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చితే లేదా కార్యక్రమ నిర్వాహకులు ఖర్చును భరిస్తేనే అధికారిక పర్యటనలకు అనుమతులి వ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్సీ మ్యాథ్యూ ఉత్తర్వులో పేర్కొన్నారు.నిషేధాజ్ఞలు సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉన్న ఐదుగురు సభ్యుల పరిశీలన కమిటీని ఏడాదిపాటు కొనసాగించనున్నారు.

తాజావార్తలు