* విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి.*

దండేపల్లి.జనంసాక్షి. సెప్టెంబర్ 04 మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూPDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం. విద్యార్థులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగాPDSU రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జే.ఎల్.శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్ విద్యార్థులకు సొంతభవనాలు లేక అద్దె భవనాల్లో ఇరుకు గదులలో అనేక ఇబ్బందులు పడుతూ చదువుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. అంతేకాకుండా ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచక విద్యార్థులకు చాలీచాలని భోజనంతో సగం ఆకలితో.గడుపుతున్నారు.హాస్టల్లో కనీస సౌకర్యాలు లేక నీటి వసతులు, మరుగుదొడ్లు, ఇతర సమస్యలతో విద్యార్థుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా నిర్వహించి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని. గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థులు పిట్టల రాలిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని పర్యవేక్షణ నిర్వహించాలని. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని PDSU విద్యార్థి సంఘంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని.హెచ్చరించారుఈ కార్యక్రమంలో అశ్విత్, శివ, విద్యార్థులు పాల్గొన్నారు..