విద్యుత్‌ కోసమే ఢిల్లీకి సీఎం : జానారెడ్డి

హైదరాబాద్‌: పవర్‌ కోసమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి జనారెడ్డి తెలియజేశారు. విద్యుత్‌  కొరత ఉన్న మాట వాస్తవమే అని ఆయన అన్నారు. రెండు, మూడు రోజుల్లో కరెంట్‌ కోతలు లేకుండా చూస్తామని చెప్పారు. అంచనాలకు మించి విద్యుత్‌ను సరఫరా చేసిన కరెంట్‌ కోతలు తప్పడం లేదన్నారు. వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్నదే తమ విధానమేనని, అందుకోసం ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా విద్యుత్‌ సమస్య నెలకొన్నదని  పేర్కోన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దీక్షలు విరమించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.