విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ప్లాస్టిక్‌ కంపెనీ దగ్ధం

కరీంనగర్‌, జనవరి 19 (: పట్టణంలోని పద్మానగర్‌లోని ప్రాంతంలోగల ప్లాస్టిక్‌ కంపెనీలో శనివారం తెల్లవారుజామున, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. ఈ కంపెనీలో డబుల్‌ రొట్టెలకు పాక్‌చేసే ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర కవర్లు తయారు చేస్తుంటారు. కంపెనీ యాజమాన్యం చెబుతున్న విధంగా సుమారు 30లక్షల రూపాయల నష్టం కలిగిందని, అందులో పనిచేసే కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వారు తెలిపారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని కంపెనీ యజమానులు తెలిపారు. పూర్తిగా కంపెనీ కాలిపోవడంతో తమకు పని లేకపోవడంతో రోడ్డు పాలయ్యామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.