విపక్షాల బంద్‌కు బీఎస్పీ దూరం

న్యూఢిల్లీ: చిల్లర వక్తకంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా విపక్షాలు రేపు చేయనున్న వేశవ్యాప్త బంద్‌కు దూరంగా ఉండాలని బహుజనసమాజ్‌ పార్టీ నిర్ణయించింది. లోక్‌ సభలో 21మంది ఎంపీలున్న ఆ పార్టీ తమకు మద్దతుగా నిలవటం యూపీఏకు వూరటనిచ్చే అంశం. యూపీఏతో తమ అనుబంధం ఎలా ఉండాలనే విషయంపై అక్టోబర్‌ 9న నిర్ణయం తీసుకుంటామని పార్టీ అధ్యక్షురాలు మాయావతి తెలిపారు.