విపత్తు నిర్వహణ అధికారులతో మంత్రి రఘువీరా సమీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై విపత్తు నిర్వహణ అధికారులతో మంత్రి రఘవీరా సమీక్ష జరిపారు. జూలై 15లోగా ఆశించిన వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంటలను ప్రొత్సహించాలని సూచించారు. ఈ నెలాఖరులోగా సాధారణ స్థాయిలో వర్షాలు కురవకపోతే పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 136 మి.మి సాధారణ వర్షపాతానికి 101 మి.మి మాత్రమే నమోదైందన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 25 శాతం తక్కువన్నారు. 2214 గ్రామాలకు రవాణా ద్వారా, మరో 3 వేల గ్రామాలకు ప్రైవేటు బోర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్యయంతో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.