విప్లవ కవి వరవరరావు విడుదల
విప్లవ కవి వరవరరావు ఎట్టకేలకు శనివారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు నానావతి ఆస్పత్రి నుంచి విడుదలయ్యారు. విడుదలైన వెంటనే చిరునవ్వులు చిందిస్తూ పిడికిలి పైకెత్తారు.
ముంబాయి మార్చి 6 (జనంసాక్షి):
ఇటివల రూ. 50 వేల క్యాష్ సెక్యూరిటీతో ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు అంగీకరించింది. అలాగే రూ. 50 వేల చొప్పున ఇద్దరు వ్యక్తుల షూరిటీలను సమర్పించాలని కోర్టు తెలిపింది. వీటిని సమర్పించేందుకు ఏప్రిల్ 5 వరకు గడువిచ్చింది. ఈ మేరకు జస్టిస్ ఎస్ ఎస్ షిండే, జస్టిస్ మనీష్ పిటాలే ఆయనకు ఆరు నెలల పాటు తాత్కాలిక బెయిల్‌కు అనుమతించారు. ఇక, ప్రస్తుతం నానావతి ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న వరవరరావు బెయిల్ నిబంధనలు పూర్తౌెన వెంటనే విడుదలయ్యారు. ఇక, అనారోగ్యం, వయసు తదితర కారణాలతో హైకోర్టు వరవరరావుకు గత వారమే బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోన్న బీమా కోరేగావ్ కేసులో నిందితుడైన వరవరరావు (82) 2018 ఆగస్టు 28 నుంచి కస్టడీలో ఉన్నారు. అయితే ఆరోగ్య సమస్యలు దృష్ట్యా ఆయన ప్రస్తుతం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్సపొందారు. ఇటీవల ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు గత వారం ఆరు నెలల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని, వయసును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణ యం తీసుకున్నట్టు ధర్మాసనం పేర్కొంది. అయితే ఇందుకోసం రూ. 50వేల వ్యక్తిగత జావిూనుతో పాటు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇద్దరు వ్యక్తుల జావిూను ప్రక్రియ ఆల స్యం అవుతోందని, నగదు పూచీకత్తుతో వరవరరావును విడుదలకు అనుమ తించాలంటూ ఆయన తరఫున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది. నగదు పూచీకత్తు సమర్పించేందుకు అనుమతించింది కావాల్సిన డాక్యుమెంట్లని సమర్పించడంతో శనివారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు వరవరరావు నానావతి ఆసుపత్రిలో నుంచి విడుదల అయ్యారు