విలాస్‌రావును పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

చెన్నై: పెరుంబాక్కంలోని గ్లోబల్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కేంద్రమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయనను మరో రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని డాక్టర్లు తెలిపారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు కోరిక మేరకు డాక్టర్లు విలాస్‌రావఖ్‌ ఆరోగ్యపరిస్థితిపై ఎలాంటి బులిటిన్లు విడుదల చేయటం లేదు. ఆయనను ఉంచి ఐసీచు ఫ్లోర్‌లోకి డాక్టర్లు, పోలీసులు, వీఐపీలను తప్ప ఎవరినీ వెళ్లనివ్వటం లేదు. ఈరోజు ఆయనను పరామర్శించేందుకు మహారాష్ట్ర సీఎం ఆయన మంత్రివర్గ సహచరులు 12మంది ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చారు. ఆసుపత్రిలో ఆయనను పరామర్శించిన అనంతరంవారు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.