వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి

రుద్రంగి నవంబర్ 29 (జనం సాక్షి )రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ బుధవారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఓ కుటుంబ సభ్యునిగా ఆపద సంపదలో ముందుంటూ ప్రతి ప్రతి సమస్య పరిష్కారానికి మీకు తోడుంటానని రేపు జరగబోయే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటును వేసి నన్ను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పొద్దుపొడుపు లింగారెడ్డి,డిసిసి కార్యదర్శి చెలుకల తిరుపతి,తర్రే మనోహర్,ఎర్రం  గంగ నరసయ్య,గడ్డం శ్రీనివాస్ రెడ్డి,మాడి శెట్టి అభిలాష్,ధర్నా మల్లేశం తదితరులు పాల్గొన్నారు