*వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి*
*మండల వీఆర్ఏల జేఏసీ కమిటీ చైర్మన్ బీసన్న*
ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 27 వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మండల వీఆర్ఏల జేఏసీ కమిటీ చైర్మన్ బీసన్న, కన్వీనర్ జి. నరసింహులు కో-కన్వీనర్ నాగరాజు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన వీఆర్ఏల నిరువదిక సమ్మె మంగళవారానికి 65వ రోజుకు చేరుకుంది. వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన మూడు హామీలను అమలు చేస్తూ జీవోను ప్రతిపాదించాలని సీఎం కార్యాలయానికి ఉత్తరాల వ్రాసి నిరసన వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. రెగ్యులర్ స్కేల్, వారసత్వ నియామకాలు, అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించడం అనేవి కనీస హక్కులుగా భావించి పరిష్కరించాలని వారన్నారు. లేని యెడల నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల జేఏసీ కమిటీ సభ్యులు బి. వీరాపురం ఎనమల నాగేష్ నాయుడు, ఆర్. గార్లపాడు నాగేష్, బాషా, రాముడు, నాగరాజు, శ్రీలత తదితర గ్రామాల వీఆర్ఏల పాల్గొన్నారు.