వీహెచ్‌ ఆధ్వర్యంలో సామాజిక న్యాయంపై సదస్సు

హైదరాబాద్     వీహెచ్‌ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం అనే అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు శనివారం సదస్సును నిర్వహిస్తున్నారు. గాంధీభవన్‌లోని ప్రకాశం హాలులో మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ఎస్‌, జైపాల్‌రెడ్డితో సహా పలువురు నాయకులు హాజరవుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ పంపులు, ఎల్పీజీ కేంద్రాల కేటాయింపులో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ కల్పించిన నేపధ్యంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.