వీ.కే.సింగ్‌ అసాధారణ చర్య

న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) :
సర్వ సైన్యాధ్యక్షుడు వి.కె.సింగ్‌ కొద్ది రోజుల్లో రిటైర్‌ అవుతారనగా ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న అవధేష్‌ సింగ్‌ సుక్మా భూ కుంభకోణంలో నిందితుడని సైనిక న్యాయస్థానం నిర్ధారించిన నేపథ్యంలో ఆయనను సస్పెండ్‌ చేశారు. అందువల్ల, ఆయనకు పెన్షన్‌ లాంటి సౌకర్యాలు అందవు. సైనిక సర్వీ సుతో గల ఉద్యో గాలురావు. తన ర్యాంకును బయట ఉపయోగిం చుకోవడానికి వీలుండదు. సైన్యంలో ఇలా శిక్షకు గురైన అధికారి అవధేష్‌ మాత్రమే కావడం గమనార్హం. గత ఏడాది సైనిక ట్రిబ్యునల్‌ అవధేష్‌ను నింది తునిగా నిర్ధారించింది. ఆదివారం వి.కె.సింగ్‌ ఆయనకు శిక్ష ఖరారు చేశారు. దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని, ఇతర ఐచ్ఛికాలను కూడా పరిశీలిస్తానని అవధేష్‌ వెల్లడించారు. గతంలో ఆర్టీఐ చట్టం ద్వారా వి.కె.సింగ్‌ పుట్టిన తేదీని అవధేష్‌ కోరారు. ఈ అంశం సుప్రీం కోర్టుకు వరకు వెళ్లింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు వి.కె.ను తప్పు పట్టింది.