వూరపండగా సందడి

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండలోని రావుట్ల గ్రామంలో సోమవారం గ్రామస్థులు వూరపండగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామ దేవతల నూతన విగ్రహాలను ప్రతిష్ఠించి పూజ నిర్వహించారు. దేవతల ముందు బలి అర్పించి పశువులకు వ్యాధులు సోకకుండా, పైర్లకు తెగుళ్లు ఆశించ రాదని కోరుతూ పండుగా నిర్వహించారు.