వేచి చూసే ధోరణిలో ఎన్డీయే నేతలు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల అంశం పై చర్చించడానికి ఈ రోజు సమావేశమైన ఎన్డీయే నేతలు చర్చలైతే జరిపారు కానీ నిర్ణయాలేమీ తీసుకోలేదు. అభ్యర్థులందరి గురించి చర్చించాం. మేం సమావేశమైంది నిర్ణయాలు తీసుకోవడానికి కాదు. ఇప్పటివరకు జరిగిన పరిణామాల పై చర్చ జరపడానికి ఇక ముందు జరగే పరిణామాలనూ గమనిస్తూంటాం. అవసరమైనప్పుడు మా అభిప్రాయన్ని వెల్లడిస్తాం… అని చెప్పారు ఎన్డీయే వర్కింగ్‌ చైర్‌ పర్సన్‌, భాజపా నేత ఎల్‌ కే అద్వానీ. గంటన్నర పైగా సమావేశమైన ఎన్డీయే సభ్యులు ఎవరితో భేటీ అయ్యారు, ఎవరిని రాష్ట్రపతి భవన్‌కు పంపాలనుకుంన్నారు. తదితర అంశాలను చెర్చించారు. ఎన్డీయే తయ ముఖ్యమంత్రులను కూడా సంప్రదించిన అనంతరం మళ్ళి సమావేశం కానున్నది.