వైఎస్‌ను పదేపదే చంపి సానుభూతి కోసం యత్నిస్తోంది

టీజీ వెంకటేశ్‌

హైదరాబాద్‌: వైఎస్‌ ఒక్కసారి మరణిస్తే… జగన్‌ మీడియా ఆయన్ను పదే పదే చంపి ఓట్ల సానుభూతి పొందే యత్నం చేస్తోందని మంత్రి టీజీ వెంకటేశ్‌ విమర్శించారు. సీమాంద్రలో వైకాపా అభ్యర్థులు గెలవడం వల్ల తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్ని బుజ్జగించడం అదిష్టానానికి ఇబ్బందిగా మారిందని ఆయన అన్నారు. తానాప్పటికీ సమైఖ్యవాదినేనన్న టీజీ రాష్ట్ర విభజన అంటూ జరిగితే తమ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోసారి డసెంబర్‌ 9 లాంటి అద్థరాత్రి ప్రకటనలు చేయరాదని అదిష్టానాన్ని కోరినట్లు టీజీ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే ఆధిష్టానం తెలంగాణ ఆంశంపై దృష్టి సారించనున్నట్లు వ్యాఖ్యానించారు.