వైన్‌ షాపు తొలగించాలి

విజయనగరం, ఆగస్టు 3: స్థానిక కుమ్మరి వీధికి వెళ్ళే రహదారి పక్కన ఏర్పాటు చేసిన సిరి వైన్స్‌ షాపులు తొలగించాలని మహిళలు కోరుతున్నారు. ఈ మేరకు స్థానిక సిఐ శ్రీహరిరాజుకు వినతిపత్రం అందజేశారు. మద్యం మత్తులో మందుబాబులు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మహిళలు వాపోయారు. దీనిపై పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాస్కరరావు, నాగమణి, వాసు తదితరులు పాల్గొన్నారు.