వైశ్య ఫెడరేషన్ పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి

వైశ్య ఫెడరేషన్ పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చల్లా కన్ స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో  ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా  అధ్యక్షులు చల్లా లక్ష్మీకాంత్ రూపొందించిన శోభాకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా  సన్మానించారు.సీతారామచంద్రస్వామి వారి జ్ఞాపికను మంత్రికి బహుకరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ ,పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, జిల్లా బిఆర్ఎస్ నాయకులు ఉప్పల ఆనంద్, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి తోట రమేష్, నాయకులు  రాచకొండ శ్రీనివాస్,చల్లా లక్ష్మీ ప్రసాద్, కలకోట లక్ష్మయ్య , గుండా శ్రీధర్, తేరటపల్లి సతీష్  తదితరులు పాల్గొన్నారు.