వ్యక్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి

నల్గోండ:చింతలపల్లి మండలం వింజమూరులో వ్యవ్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి జరిగింది.వ్యక్తిగత కక్ష్యల కారణంగా ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దంపతులపై దాడి చేశారు.ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది.తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.