వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన

అశ్వారావుపేట: వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అశ్వారావుపేటలో భారీ ప్రదర్శన నిర్వహించారు. 50 తునిగాకు కట్టకు రూ. 2 ఇవ్వాలని, భూ సమస్యలపై కోనేరు రంగారావు సిఫార్సులను గ్రామస్థాయిలో అమలు చేయాలని, ఆహార భద్రతా చట్టాన్ని పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించాలని, తదితర 14 రకాల డిమాండ్లతో అశ్వారావుపేటలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీకేఎంయూ కేంద్ర సభ్యులు యలమర్తి కృష్ణ, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సలీవమ్‌ తదితరులు పాల్గొన్నారు.