శంషాబాద్‌ విమానాశ్రయంలో సైనాకు ఘన స్వాగతం

హైదరాబాద్‌:  లండన్‌ ఒలంపిక్స్‌లో కాంస్య విజేత హైదరాబాదీ స్టార్‌ షట్లర్‌ సైనానెహ్వల్‌కు శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. శాప్‌ అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. సైనాకు అభినందనలు తెలిపారు. శంషాబాద్‌ నుండి గోపిచంద్‌ అకాడమీకి భారీ సంఖ్యలో అభిమానుల కోలహాలంతో బయలుదేరారు.