శంషాబాద్ విమానాశ్రయంలో రాకపోకల పునరుద్ధరణ
హైదరాబాద్: పొగ మంచు కమ్ముకోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలో నిలిచిన విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం రన్‌వేపై దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ , జైపూర్, అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను చెనైకి మళ్లించారు. అయితే 10 గంటల తర్వాత పరిస్థితి మెరుగుపడటంతో చెనైకి మళ్లించిన విమానాలను తిరిగి శంషాబాద్‌కు తరలించారు.