శుద్ధిజల పథకాన్ని విస్మరించిన అధికారులు

వినుకొండ, ఆగస్టు 3 : ఫ్లోరైడ్‌ తాగునీటి కష్టాలు తీర్చడానికి వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం గండిగనుముల గ్రామానికి మంజూరు చేసిన శుద్ధి జల పథకం ఉపయోగం లేకుడా పోయింది. నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన పంచాయతీ ప్రత్యేక అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ మోటార్‌ సమస్య వల్లే పథకం ఎందుకూ పనికి రాకుండా పోయిందని అంటున్నారు. వెంటనే ఉన్నతాధికారులు దీనిపై స్పందించి ఈ సమస్యను పరిష్కారించాలని వారు కోరుతున్నారు.