శ్రీనివాసపురంలో ఘనంగా పోషణ్ పక్వాడ్ ర్యాలీ
హుజూర్ నగర్ మార్చి 23 (జనంసాక్షి): మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో ప్లే కార్డుల ప్రదర్శన చేపట్టి గురువారం చిరుధాన్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్ పత్తిపాటి రమ్యనాగరాజు పాల్గొని మాట్లాడుతూ చిరుధాన్యాలు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయని, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఉదర సమస్యలు తగ్గుతాయని, చిరుధాన్యాలలో విటమిన్స్, ఐరన్, ఫైబర్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయని వివరించారు. పోషకాహార లోపం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గురవయ్య, కార్యదర్శి శేఖర్, పాఠశాల హెచ్ఎం చిక్కుల గోవిందు, ఏఎన్ఎం అలివేలు మంగ, అంగన్వాడీ టీచర్స్ మంజుల, పార్వతి, సంధ్య, కమలమ్మ, సునీత పాల్గొన్నారు.