శ్రీలంకకు వైమానిక శిక్షణపై జయ అభ్యంతరం

చెన్నై:చెన్నై నగర సమీపంలోని తాంబరం భారత వాయసేవా కేంద్రంలో శ్రీలంక వైమానిక దళానికి శిక్షణ ఇవ్వడంపై తమిళ ముఖ్యమంత్రి జయలలిత మండిపడ్డారు.ఈ కార్యక్రమాన్ని వెంటనే రద్దుచేసి శ్రీలంక సిబ్బందిని వారి స్వదేశానికి పంపించివేయాలని ఆమె డిమాండ్‌చేశారు.శ్రీలంకలోని తమిళులకు సమానహక్కుల కల్పించడంతో ఆ దేశ ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు.తమిళులపై శ్రీలంక సైన్యం చేసిన యుద్దనేరాలకు సంబంధించి బాద్యులను శిక్షించాలని కోరుతున్న తరుణంలో శ్రీలంక దళాలకు శిక్షణ ఇవ్వడం తగదని ఆమె హితవు పలికారు.