శ్రీవారిని దర్శించిన యూపి మాజీ సీఎం ఉమాభారతి

తిరుమల, ఆగస్టు 2 : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్థానిక పద్మావతి అతిథి గృహాల సముదాయం వద్ద ఆమెకు రిసెప్షన్‌ అధికారి భూపతిరెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి వసతి సౌకర్యం కల్పించారు. బుధవారం రాత్రి విశ్రాంతి తీసుకున్న ఆమెకు కుటుంబ సభ్యులకు టిటిడి అధికారులు గురువారం నాడు ఉదయం శ్రీవారికి నిర్వహించిన తిరుప్పావై సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీలో ఉమాభారతి కానుకలు సమర్పించిన అనంతరం రంగనాయక మండపంలో ఆమెను వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ డిప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డి స్వామివారి తీర్ధప్రసాదాలు అందించారు. గురువారం ఉదయం 9గంటలకు ఆమె తిరుమల నుంచి తిరుపతి ప్రయాణమయ్యరు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నట్లు సమాచారం.