అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 27
అల్వాల్ సర్కిల్ దేవుని అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి టెంపుల్ లో గత మూడు రోజులుగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ సుదర్శన మహా యజ్ఞం శనివారం పూర్ణాహుతితో ముగిసింది. ప్రజల కష్టాలు తొలిగి శత్రు బాధలుతొలగి ఆయురారోగ్యాలు సిరి సంపదలు ప్రసాదించేలక్ష్మీసుదర్శనమహాయాగంలో చివరిరోజు అలయట్రస్టీ వ్యవస్తాపక ఛైర్మన్ రాజా సంజయ్ గోపాల్ సైంచర్ దేవాలయం కార్యనిర్వాహణ అధికారి వి.నరేందర్ అధ్వర్యంలో హోమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కుటుంబ సమేతంగా పాల్గొన్న భక్తులతో పూజారులు ఆలయ అర్చకులు హోమ క్రతువులను నిర్వహింప చేశారు. కార్యక్రమంలో దేవాలయం సీనియర్ అకౌంటెంట్ బాల్ నర్సయ్య, నరేష్, ఆచార్య రాహుల్, రఘుపంతులుశ్రీనివాస్ పంతులు గోపాలు పంతులు శివరామ కృష్ణా, రాము, రాజ నర్సింహ రెడ్డి, సత్యనారాయణ, భాస్కర్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హోమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.