శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భద్రకాళి అమ్మవారు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 30(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రకాళి అమ్మవారిని లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు వేలాదిగా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో శేషు భారతి ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు సూపర్ ఇంటెండెంట్ విజయ్ మిగతా అర్చక బృందం సిబ్బంది అన్ని రకాల ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో భక్తి కార్యక్రమంలో భాగంగా వేద పండితులు తమ ప్రవచనాలను వినిపించారు.
Attachments area