షిండే ఎందుకు మాట తప్పారో వివరణ ఇవ్వాలి: కేటీఆర్
హైదరాబాద్: జనవరి 28లోగా తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కేంద్రమంత్రి షిండే తెలంగాణ పరిష్కారానికి గడువు లేదని వ్యంగ్యంగా సమాధానం చెప్పడం ఏంటని తెరాస ఎమ్మెల్యే కె.రామారావు విమర్శించారు. హోంమంత్రి షిండే ఎందుకు మాట తప్పారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచేందుకు జేఏసీ ప్రకటించిన కార్యక్రమాల్లో చురుగ్గాపాల్గొంటామని ఆయన చెప్పారు. తెరాస కార్మిక విభాగం ఫిబ్రవరి 21,22 న జరిగే సార్వత్రిక సమ్మె గోడ పత్రికను కేటీఆర్ ఆవిష్కరించారు. దేశవ్యాప్త సమ్మెకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.