షీ టీమ్స్, సైబర్ నేరాల పై విద్యార్థులకు అవగాహన సదస్సు 

*పెన్ పహాడ్ జూలై 18 (జనం సాక్షి) : జిల్లా ఎస్పీ యస్ రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు షీ టీమ్స్ ఇన్చార్జి డిఎస్పి పరికే నాగభూషణం సూచనలతో స్థానిక ఎస్ఐ వెంకన్న సహకారంతో మంగళవారం మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో షీ టీమ్స్, సైబర్ నేరాల పైన , మహిళలు మరియు పిల్లల భద్రత గురించి, పోలీస్ కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా పోలీస్ కళాబృందం చేత షీ టీమ్స్, మహిళల భద్రత రక్షణ,100 డైల్ , సోషల్ మీడియా, ఓటిపి ఫ్రాడ్స్, సైబర్ నేరాలు, టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి,సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల గురించి, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆట పాటల ద్వారా పాఠశాల విద్యార్థినిలకు అవగాహన చేశారు ఈ కార్యక్రమానికి స్థానిక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మురళిదర్ రెడ్డి ,జిల్లా షీ టీమ్స్ హెడ్ కానిస్టేబుల్ జాఫర్ ,కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ ఆసియా, పోలీస్ స్టేషన్ సిబ్బంది శ్రీనివాస్ , సైదులు, లింగయ్య ,బ్లూ కోర్ట్ సిబ్బంది, భరోసా సెంటర్ నుండి మౌనిక ,కిరణ్మయి, పోలీస్ కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, చారి,నాగార్జున,కృష్ణ విద్యార్థినిలు పాల్గొన్నారు…