సంఘ విద్రోహ శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: సంఘ విద్రోహ శక్తుల పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యపేట కాల్పుల ఘటనలో పోలీసులు ప్రదర్శించిన ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సంఘ విద్రోహ శక్తులను అరెస్టు చేసే క్రమంలో మృతి చెందిన కానిస్టేబుల్స్ లింగయ్య, నాగరాజు, హోంగార్డు మహేష్ లు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.