సంవత్సరమైనా మంజూరు కానీ మెడికల్ బిల్లులు

* టి.పి.టి.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్

టేకులపల్లి,మార్చి 18 జనం సాక్షి ): ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు,జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి సమర్పించి సంవత్సరం కావస్తున్న నేటికీ మంజూరు కాకపోవడం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ అన్నారు. కోయగూడెంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో వారు మాట్లాడుతూ, అనారోగ్యానికి గురై ప్రైవేటు రిఫరల్ ఆసుపత్రులలో వైద్య చికిత్సలు పొంది మెడికల్ రియంబర్స్మెంట్ కింద బిల్లులు సమర్పించుకొని సంవత్సరం కావస్తున్న నేటికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మెడికల్ బిల్లులు మంజూరు కాకుండా ఉండడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ కింద కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందకపోవడంతో వారు అందుబాటులోని రిఫరల్ ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స పొంది,ఆ బిల్లులను మెడికల్ రియంబర్స్మెంట్ కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ,ఉచిత వైద్యాన్ని హెల్త్ స్కీం కింద అందించకపోవడం పోగా బిల్లులను కూడా సంవత్సరాల పొడవునా మంజూరు చేయకుండా ఉండడం సరైనది కాదని,వెంటనే వాటిని మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగులు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ కు వారి బేసిక్ పే నుండి ఒక శాతం కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా,ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స అందించలేకపోవడం బాధాకరమని,ఉపాధ్యాయ ఉద్యోగులకు అనారోగ్యం చేస్తే వారు వడ్డీలకు అప్పులు తీసుకొని చికిత్స పొందవలసి వస్తున్నదని,అనేక ఆర్థిక ఇబ్బంద�