సమరయోధుల పింఛన్‌ వెయ్యి రూపాయలు పెంచిన కేరళ: సీఎం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి వూమెస్‌ చాందీ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా  సమరయోధుల పింఛనును వెయ్యి రూపాయలు పెంచారు. వచ్చే సంవత్సరం  ఏప్రిల్‌ నుంచీ అన్ని రకాల పింఛన్లూ బ్యాంకు ఎకౌంట్ల ద్వారానే ఇచ్చే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ‘ద రైట్‌ టు సర్వీస్‌ ‘ చట్టాన్ని నవంబరు ఒకటి నుంచి అమల్లోకి తెస్తున్నట్లు చాందీ చెప్పారు.