సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకం.
పాఠశాల చైర్మన్ నాగమ్మ.
తాండూరు సెప్టెంబర్ 5( జనం సాక్షి)సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైందని మల్రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల చైర్మన్ నాగమ్మ పేర్కొన్నారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యను బోధించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి చక్కగా బోధించిన సందర్భంగా వారికి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ నాగమ్మ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలోనే ఉందని తెలిపారు. విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపించేది ఉపాధ్యాయులని వెల్లడించారు.ఈ కార్యక్రమం లో ప్రజల ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు