సల్వాజుడుం చీఫ్‌ మహేంద్రర్మాపై నక్సల్స్‌ దాడి

రాయపూర్‌: నవంబర్‌ 8, ( జనంసాక్షి):

బస్తర్‌ జిల్లాలో నక్సల్స్‌ వ్యతిరేఖ ఉద్యమ రూపకర్తకాంగ్రెస్‌ నేత మహేంద్రర్మా ప్రయాణిస్తున్న వాహన శ్రేణి లక్ష్యంగా మావోయిస్టులు గురువారం దంతెవాడ జిల్లాలో శక్తిమంతమైన మందుపాతర పేల్చారు. ఆయన సురక్షితంగానే ఉన్నారని డ్రైవర్‌, అంగరక్షకుడు గాయాపడ్డాడని సీనియర్‌: పోలీసు అధికారి తెలిపారు. ఛత్తిస్‌గఢ్‌ కుర్మా మాజి విపక్ష నేతగా పని చేశారు. అజిత్‌ జోగి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. సీనియర్‌ గిరిజన నేత అయిన కుర్మా ఫారాస్పల్‌ నుంచి బర్సూర్‌కు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెలుతుండగా ఈ ఘటన జరిగింది. మావోయిస్ట్‌లు ముందుగా ఒక కల్వర్టును పేల్చివేశారు. తర్వాత ఆటోమేటిక్‌ ఆయుధాలతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.ర్మా ఒక బులెట్‌ ప్రూఫ్‌ వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఆయనకు ప్రభుత్వం జడ్‌ఫ్లస్‌ కేటగిరి భద్రతను కల్పించింది. సెక్యూరిటీ జవాన్లు ప్రతి కాల్పులు చేశారు. అదనపు పోలీసు బలగాలను అక్కడికి పంపారు. ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వికారం, రక్తపోటు అధికం కావటంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. గతంలో కూడా నక్సల్స్‌ తనపై దాడులు చేశారనిర్మా విలేకరులకు చెప్పారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. 2005లో బస్తర్‌ జిల్లాలో సల్వాజుడుంను ఆయన ప్రారంభించారు. అది మూడేళ్లపాటు సాగింది. కాని పలు వివదాలు చోటు చేసుకోవటంతో రద్దు చేశారు.