సహచర మిత్రునికి ఆర్థిక సాయంసహచర మిత్రునికి ఆర్థిక సాయం


ఇటిక్యాల (జనంసాక్షి) 25 : సహచర మిత్రుడు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండడం చూసి మిత్రులు చలించిపోయి తమ వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. మండల పరిధిలోని బీచుపల్లి పదవ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా  విధులు నిర్వహిస్తున్న  పర్వతాలు గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న మిత్రులు ఉద్యోగం కూడా చేయలేని పర్వతాలు పరిస్థితిని గమనించి 1995 బ్యాచ్ కి చెందిన తోటి మిత్రులు తమ వంతు సహాయంగా 1లక్ష్య రూపాయలు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు బెటాలియన్ కమాండెంట్ బి. రాంప్రకాష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ రాంప్రకాష్  మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు ఆర్థిక చేయూతని అందిస్తూ వారిని ఆదుకోవడం హర్షించదగ్గ  విషయమని అన్నారు. హెడ్ కానిస్టేబుల్ పర్వతాలకు మిత్రులుగా సహాయం అందించినందుకు వారిని కమాండెంట్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ సిబ్బందితోపాటు పర్వతాలు స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నారు.