సాగర్ సందర్శించిన యాదాద్రి భువనగిరి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు
నాగార్జునసాగర్ (నందికొండ); జనం సాక్షి, సెప్టెంబర్10; అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి , అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి కుటుంబ సమేతంగా సందర్శించారు. శనివారం మధ్యాహ్నం నాగార్జున సాగర్ చేరుకున్న వీరికి ప్రోటోకాల్ డిప్యూటీ తాసిల్దార్ శరత్ చంద్ర స్వాగతం పలికారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం,ప్రధాన జలవిద్యుత్ కేంద్రాన్ని ,ఎత్తిపోతల జలపాతం ని సందర్శించారు. ఆదివారం నాడు టూరిజం లాంచీలో నాగార్జునసాగర్ జలాశయం లో విహరించిన అనంతరం బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధ వనములో బుద్ధుని పాదాలవద్ద పుష్పాంజలి ఘటించారు. అటు తర్వాత బుద్ధవనం ప్రాజెక్టులోని బుద్ధ చరిత మనం, స్తూప వనం సందర్శించిన అనంతరం మహా స్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరం సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించడం సంపూర్ణ ఆనందాన్ని ఇచ్చిందన్నారు. వీరికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు,బుద్ధవనం ప్రాజెక్టు విశేషాలను స్థానిక టూరిజం గైడు సత్యనారాయణ వివరించారు. వీరితో పాటు స్థానిక ప్రోటోకాల్ సిబ్బంది నిరంజన్, నసీర్ బాబా, సైదులు తదితరులు పాల్గొన్నారు.