సామాజిక సేవా కార్యక్రమాంలో తానాకు 50 వేల డాలర్ల విరాళం

వాషింగ్టన్‌ : అమెరికాలోని జె.పి.మోర్గాన్‌ చేజ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల సహయార్ధం చేపట్టిన నిధుల సేకరణ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా 50 వేల డాలర్లు అందుకుంది. ఫేస్‌బుక్‌లో ప్రతిసంస్థకు పడ్డ ఓట్ల ఆధారంగా విజేతలను నిర్ణయించారు. తానాకు అందిన మొత్తాన్ని తెలుగు భాషాభివృద్ధి, ఇతర సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని నిధుల సేకరణ కమిటీ ఛైర్మన్‌ తోటకూర ప్రాసద్‌ తెలిపారు. మరోవైపు రాష్ట్రానికి చెందిన వి.టి.సేవా సంస్థ చేజ్‌ బ్యాంకు నుంచి లక్ష డాలర్లు అందుకుంది.