సింహాద్రి ఎన్‌టీపీసీ వద్ద మత్స్యకారుల ఆందోళన

పరవాడ:  ఉపాధి విషయమై విశాఖ జిల్లా పరవాడ మండలం చిక్కవానిపాలెం మత్స్యకారులు సింహ్రాద్రి ఎస్‌టీపీసీ జెట్టీ వద్ద చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి  తీసింది. మత్స్యకారులు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిపై కర్రలతో, ఇనుపరాడ్లతో దాడి చేశారు. పనులు జరుగుతున్న పైపులను రహదారికి అడ్డంగా పెట్టి రాకపోకలను స్తంభింపజేశారు. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో దాడి చేయ్యాల్సి వచ్చిందని మత్స్యకారులు చెబుతున్నారు.