సిమెంట్‌ ఫ్యాక్టరీ మూతకు ఆదేశం

ఆదిలాబాద్‌్‌, జూలై 18: జిల్లాలో అతిపెద్దదైన ప్రభుత్వ రంగ భారీ పరిశ్రమ అయిన సిమెంట్‌ ఫ్యాక్టరీ త్వరలో మూతపడనున్నది. గత కొంత కాలంగా సీసీఐ పునప్రారంభం అవుతుందని కార్మిక నేతలతోపాటు ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ ఇందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో వందలాది మంది కార్మిక జీవితాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఎంతో వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్త పరిశ్రమలు రాకపోకగా ఉన్న పరిశ్రమలు మూత పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం, ఇటు జల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు గాని శ్రద్ధ తీసుకోకపోవడంతో జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం 1980లో సిమెంట్‌ పరిశ్రమను 3వేల మంది కార్మికులతో ప్రారంభించింది. రోజురోజుకు పరిశ్రమ ఉత్పత్తి పెరుగుతూ కార్మికుల సంఖ్య 8వేలకు చేరుకుంది. నిర్వాహణలో ఫ్యాక్టరీకి రాయితీలు గాని, ఇందుకు సరిపడ నిధుల గాని అందజేయకపోవడంతో పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో నష్టాలు భరించలేక 1998లో ప్యాక్టరీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దేశంలో ఇతర ప్రభుత్వ రంగ సిమెంట్‌ ఫ్యాక్టరీలకు భారీగా నిధులు, రాయితీలు కల్పించి ఆ పరిశ్రమలను గట్టేక్కించిన కేంద్రం ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ పరిశ్రమకు ముండిచేయి చూపడంతో ఫ్యాక్టరీ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎన్నికల ప్రచారంలో సిమెంట్‌ పరిశ్రమ ప్రధాన హస్త్రంగా చేసుకుని అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఇతర పార్టీలు కూడా పరిశ్రమల తిరిగి పునప్రారంభిస్తామని హామీలు ఇచ్చారు. అయిన్నప్పటికీ పరిశ్రమ పునప్రారంభంలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 200 మంది కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఒప్పంద కార్మికుల సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసింది. త్వరలో ఈ పరిశ్రమలో ఉన్న మరో 250మంది సిబ్బందిని, కార్మికులను తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవ డంతో ఈ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయడం జరుగుతుంది. పరిశ్రమను నమ్ముకుని కార్మికులు, ఉద్యోగులు తిరిగి పునప్రారంభం అవుతుందని ఆశలు పెట్టుకునప్పటికీ ప్రభుత్వ ఆదేశాలతో వారిలో ఆందోళన మొదలైంది.