సీఎంకు ఉద్యోగ సంఘాల ఐకాస వినతిపత్రం
హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ఉద్యోగుల ఐకాస సచివాలయంలో ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసింది. పదవ వేతన సంఘం ఏర్పాటుతో పాటు ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలని వారు కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21, డిసెంబరు 9,19 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు సంఘం నేతలు వెల్లడించారు.