సీఎం కిరణ్‌కు విద్యుత్‌ కొరతపై కేసీఆర్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌: తెలంగాణలో నెలకొన్న విద్యుత్‌ కొరతపై సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. విద్యుత్‌ కొరతతో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటుందని పేర్కోన్నారు. తెలంగాణ రైతులకు అదనపు విద్యుత్‌ ఇవ్వకపోగా ఎందుకు తగ్గిస్తున్నారని ప్రశ్నించారు. కృష్ణా డెల్టాకు నీటిని తరలించడానికి శ్రీశైలం, సాగర్‌లను ఖాళీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అదనపు విద్యుత్‌ తెప్పించాలని డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు