సీఎం కిరణ్‌తో బొత్స, దానం, పళ్లం భేటీ

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, మంత్రి దానం నాగేందర్‌, కేంద్రమంత్రి పళ్లం రాజులు భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వారు కిరణ్‌తో సమావేశమయ్యారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, ధర్మాన రాజీనామా వ్యవహారం అఖిలపక్ష సమావేశం మొదలైన అంశాలపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.