సీఎం కిరణ్‌ వల్లనే తెలంగాణ జప్యం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ప్రధాన అడ్డంకిగా మారాడని కాంగ్రెస్‌ నేత నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కి అన్నారు. సీఎం వల్లే తెలంగాణ ఆలస్యం అవుతోందని ఆయన విమర్శించారు. సీఎం రేపటి నుంచి చేపట్టబోయే ‘ఇందిరమ్మ బాట’ను తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలు బహిష్కరించాలని ఆరోపించారు.