సీఎం పర్యటనతో ఒరిగేదేమీలేదు : కిషన్‌రెడ్డి

రాజమండ్రి : వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి బాధితులకు ఏ రకమైన లబ్ది కల్పించలేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం పర్యటన తూతూ మంత్రంగా సాగిందని ఆరోపించారు. జిల్లాలోని ముంపు గ్రామాల్లో కిషన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పటికీ గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదని ఆందోళన వ్యక్తంచేశారు. సహాయకచర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసి బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.