సీఎం ప్రయాణించే హెలికాప్టర్‌తె పాటు ఆరు విమానాలు దగ్థం
బేగంపేట విమానాశ్రయ అగ్నిప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ
హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో నిన్న అర్థరాత్రి చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మొత్తం 6 విమానాలు, హెలికాప్టర్ దగ్థమయ్యాయి. కాలిపోయిన వాటిలో ఏవియేషన్‌కు చెందిన 6 విమానాలు ఉన్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రయాణించే ప్రభుత్వం హెలికాప్టర్ అగస్టా కూడా అగ్నికి ఆహుతైందని చెప్పారు. అగ్ని ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఆగస్టా హెలికాప్టర్ కాలిపోవడంతో సీఎం ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అగస్టా విలువ రూ. 63 కోట్లు ఉంటుందని,. బీమా ఉన్నందును క్లెయిమ్ చేసుకుంటామని మంత్రి చెప్పారు.