సీఎం శ్రీశైలం పర్యటన రద్దు

శ్రీశైలం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీశైలం పర్యటన రద్దయింది. నంద్యాలనుంచి ఇక్కడికి రావలసి ఉంది. శ్రీశైలం డ్యామ్‌ పరిశీలన, అమ్మవారి దర్శనం ఆయన పర్యటనలో ఉండగా వాతావరణం అనుకూలించకపోవటంతో ఆయన ఇక్కడికి రాకుండా నేరుగా హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అదేవిథంగా మహానందిలో పాడి పరిశ్రమ రైతులు, గొర్రెల పెంపకందారులతో సీఎం ముఖాముఖి కూడా రద్దయింది.